భారతదేశం, ఏప్రిల్ 17 -- తెలంగాణలో గ్రూప్‌ 1న నియామకాలు సందిగ్ధంలో పడ్డాయి. గ్రూప్‌1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 19మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించారు.

తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపాలని పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. వారికి నియామక పత్రాలను మాత్రం తుది తీర్పు తర్వాత అందించాలని ఆదేశించింది.

టీజీపీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ఇప్పటికే కమిషన్‌ వెల్లడించింది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఉందని పేర్కొ...