భారతదేశం, డిసెంబర్ 3 -- రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా మొత్తం 3 విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా.. చివరి విడత నామినేషన్లు ఇవాళ్టి నుంచి స్వీకరిస్తారు. ఇందుకోసం ఆయా గ్రామ పంచాయతీల్లో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఇవాళ్టి నుంచి మొదలయ్యే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మూడు రోజులపాటు జరుగనుంది. ఈ మూడు రోజుల్లో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఆ తరువాత రోజు నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. చెల్లుబాటైన నామినేషన్ల ప్రకటన తర్వాత. ఆ మరుసటి రోజు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ...