భారతదేశం, డిసెంబర్ 11 -- రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ముందు వరుసలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవగా. కొన్నిచోట్ల బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. మరికొన్నిచోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఇవాళ జరిగిన పోలింగ్‌లో 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. సాయంత్రం 6 గంటల నాటికి రిపోర్ట్స్ ప్రకారం.. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు 750కిపైగా గ్రామాల్లో విజయం సాధించారు. ఇక 350 పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవగా.. ఇండిపెండెంట్ అభ్యర్థులు 180కిపైగా చోట్ల విజయం సాధించారు. ఇక బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 70కిపైగా గ్రామాల్లో సర్పంచ్ పీఠం ...