భారతదేశం, డిసెంబర్ 5 -- రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా.. ప్రస్తుతం మూడో విడత నామినేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే తాజాగా మొదటి విడత కింద బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో తేదీ నామినేషన్ల విత్ డ్రా పూర్తైంది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 4,236 గ్రామాలకు మొదటి విడతలో నోటిఫికేషన్ ఇవ్వగా 22, 330 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీటిలో 395 గ్రామాల్లోని సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

వికారాబాద్ జిల్లాలోని 39 గ్రామాల్లో అత్యధికంగా ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత 33 గ్రామాల్లో ఏకగ్రీవమైన ఆదిలాబాద్ జిల్లా రెండవ స్థానంలో ఉం...