భారతదేశం, డిసెంబర్ 7 -- రాష్ట్రంలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీకి భారీగానే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొదటి,రెండో విడతలో ఎక్కువ సంఖ్యలోనే నామినేషన్లు దాఖలు కాగా. మూడో విడతలోనే అదే జోరు కనిపించింది. సర్పంచి, వార్డు స్థానాలకు గానూ అత్యధిక సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయి.

డిసెంబర్ 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 9న అధికారులు ప్రకటిస్తారు. ఇదే సమయంలో గుర్తుల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పోలింగ్ డిసెంబర్ 17వ తేదీన నిర్వహిస్తారు.

మొదటి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు డిసెంబర్‌ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. రెండో విడత పోలింగ్ ప్రక్రియ డిసెంబర్ 14వ తేదీ నిర్వహిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమవుతున...