భారతదేశం, డిసెంబర్ 11 -- రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. భోజన విరామం పూర్తి కావటంతో. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు.

మరోవైపు పోలింగ్ సమయం ముగిసినా కొన్నిచోట్ల ఓటర్లు బారులు తీరి ఉన్నారు. గేట్లు వేసి మధ్యాహ్నం ఒంటి గంటలోపు క్యూలైన్లో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం. మొదటి విడత కింద ఇవాళ 189 మండలాల్లోని 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. మొదట ఉప సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేస్తా...