భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా. ఓటర్లు క్రమంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం 9 తర్వాత చాలా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది.

పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన వారిని ఓటింగ్ కు అనుమతిస్తారు.

ఈ మూడో విడత కింద మొత్తం 12,652 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా. వార్డు సభ్య పదవులకు 75,725 మంది పోటీ పడుతున్నారని అధికారులు తెలిపారు. 36,483 పోలింగ్ కేంద్రాల్లో 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులుగా ఉన్నారు.

మొత్తం3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తుది దశలో 4,159 గ్రామ పంచాయతీలు...