Telangana, ఏప్రిల్ 25 -- చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ప్రకటన జారీ చేసింది. కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఉంది. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ఈ పోస్టును భర్తీ చేయనుంది. మహబూబ్ నగర్ డీసీసీబీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది.

ఈ పోస్టుకు ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టుకు సీఏఐఐబీ, డీబీఎఫ్‌ డిప్లొమా(కోఆపరేటివ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్), చార్టెడ్ అకౌంట్, పీజీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అర్హులవుతారు. కనీసం 8 ఏళ్లపాటు బ్యాంకింగ్ సెక్టార్ లో పని చేసిన అనుభవం ఉండాలి.

తెలుగు భాషలో నైపుణ్యం ఉండాలి. ఎంపికైన వారు మూడేళ్లపాటు పని చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను...