భారతదేశం, ఏప్రిల్ 27 -- తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఏప్రిల్ 30తో పదవీ వివరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఎస్ ను నియమించింది.

ప్రస్తుతం కె.రామకృష్ణారావు ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కొత్త సీఎస్‌ నియామకంపై గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

సీఎస్ ఎంపికలో సీనియారిటీ జాబితా ప్రకారం రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారుల పేర్లను పరిశీలించారు. సీనియారిటీ, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని రామకృష్ణారావును సీఎస్‌గా నియమించింది.

రామకృష్ణారావు 2014 నుంచి ఆర్థికశాఖలో కీలకంగా ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

రాష్ట్ర ప్...