భారతదేశం, సెప్టెంబర్ 26 -- తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్ రెడ్డిని ప్రభుత్వం డీజీపీగా నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను అందుకున్నారు. అక్టోబర్‌ 1న తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.

1994 బ్యాచ్ అధికారి అయిన శివధర్ రెడ్డి.. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇన్ స్పెక్టర్ జనరల్ హోదాలో తొలి ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అదనపు డీజీపీగా పదోన్నతి పొందిన తర్వాత పర్సనల్ వింగ్, రైల్వే, రోడ్ సేఫ్టీ శాఖల్లో పనిచేశారు.

2023 డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత. శివధర్ రెడ్డిని అదనపు డీజీపీ హోదాలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా తిరిగి నియమించింది. ఆగస్టు 2024లో పదోన్నతి పొందిన తర్వాత. ఆయన డైరెక్టర్ జనర...