భారతదేశం, అక్టోబర్ 31 -- తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12 తర్వాత రాజ్ భవన్ లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తిరంగా మారింది. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అయితే అలా కాకుండా మరేదైనా కీలక శాఖ కూడా అప్పగించే అవకాశం ఉందన్న చర్చ కూడా వినిపించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహముద్ అలీ హోంశాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.

అజారుద్దీన్ ప్రమాణస్వీకారంతో ప్రస్తుత కేబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా 16 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో మరో ఇద్దరు సభ్యులకు ఇ...