భారతదేశం, నవంబర్ 1 -- మంత్రివర్గ విస్తరణ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా మైనార్టీ కోటా నుంచి అజారుద్దీన్ కు అవకాశం రాగా.... మిగిలిన మరో 2 బెర్తులపై చాలా మంది నేతలు కన్నేశారు. జిల్లాల వారీగా పెద్ద లిస్టే ఉంది. ఇందులో కొన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి తప్పనిసరిగా కేబినెట్ లో అవకాశం ఉంటుందన్న చర్చ ఎప్పట్నుంచో ఉంది. సీన్ కట్ చేస్తే.... మంత్రి పదవులు ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో మంత్రి పదవుల విషయంలో సమీకరణాలు మారుపోతున్న పరిస్థితులు ఉన్నాయి.

మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును...