భారతదేశం, అక్టోబర్ 29 -- తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈసారి కొత్తగా అజారుద్దీన్‌ కు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఎల్లుండే ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేస్తే మరో రెండింటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేబినెట్ లో మైనారీవర్గాలకు చెందిన మంత్రి లేరు. విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయాలు ఎప్పట్నుంచే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. అజారుదీన్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా ఆయన టికెట్ ఆశించారు. కానీ చివరికి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారైంది. అయితే ఆయనకు కేబినెట్ చోటు కల్పి...