Telangana, మే 11 -- తెలంగాణ ఐసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మే 10వ తేదీతో పూర్తి కాగా. అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఈ గడువును మే 15వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండానే ఈ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటి వరకు 60 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మే 15వ తేదీ దాటితే ఫైన్ తో టీజీ ఐసెట్ - 2025కు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 250 ఫైన్ తో మే 17 వరకు అవకాశం ఉంటుంది. ఇక రూ. 500 ఆలస్య రుసుంతో మే 26వ తేదీ వరకు అప్లికేషన్ ప్రాసెస్ కు అవకాశం ఉంటుంది. మే 16వ తేదీ నుంచి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే మే 20 వరకు సవరించుకోవచ్చు.

టీజీ ఐసెట్ - 2025 హాల్ టికెట్లు మే 28వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 8,9 తేదీల్లో పరీక్షలను...