Telangana, జూన్ 21 -- రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ - 2025 ఫలితాలు వచ్చేశాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను కాకతీయ యూనివర్శిటీ చేపట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.

తెలంగాణ ఎడ్ సెట్ పరీక్షలు జూన్‌ 1వ తేదీన జరిగాయి. మొదటి షెషన్‌ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించారు.

ఈసారి జరిగిన ఎడ్ సెట్‌కు 38,754 మంది దరఖాస్తు చేసుకోగా 32,106 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 96.38 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫలితాల్లో గణపతి శాస్త్రి 126 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు...