భారతదేశం, సెప్టెంబర్ 1 -- తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మన్ సహా మెుత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావును ఛైర్మన్‌గా నియమించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020, రాష్ట్ర నిర్దిష్ట విద్యా అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించనుంది.

తెలంగాణ రైజింగ్ 2047 కోసం మార్గదర్శక పత్రంగా తెలంగాణ విద్యా విధానాన్ని రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా ఆగస్టు 29న ఒక మెమో జారీ చేశారు. అక్టోబర్ 30 నాటికి కమిటీ తన నివేదికను సమర్పించాలని కోరారు.

ఈ కమిటీ జాతీయ విద్యా విధానం నిబంధనలను అధ్యయనం చేయడం, వాటిని తెలంగాణ సందర్భానికి అనుగుణంగా మార్చడంలాంటివి ఎడ్యుకేషన్ పాలసీలో ...