భారతదేశం, మే 12 -- తెలంగాణలో ఇంజనీరింగ్ అడ్మిషన్లపై స్పష్టత వచ్చేసింది. ఈ ఏడాది ఈఏపీ సెట్‌ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలను జూన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలంగాణలో ఈఏపీ సెట్‌ కౌన్సె లింగ్‌లో భాగంగా అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలను జూన్ నెలలో ప్రారంభిస్తారు. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కాస్త ఆలస్యంగా మొదలవుతాయి.

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో జూన్‌ నెలాఖరులో కానీ జులై మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జూన్ 2న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలి తాలు వెలువడతాయి.జేఈఈ ఫలితాలు విడుదలైన తర్వాత ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

దేశ వ్యాప్తంగా జేఈఈ ప్రవేశాలను పూర్తి చేయడానికి నాలుగు విడతలలో జోసా కౌన్...