భారతదేశం, ఏప్రిల్ 18 -- ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు తెలంగాణలో ఈఏపీసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు ఉంటాయని అధికారులు వివరించారు. రోజూ రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అరగంట ముందు నుంచే హాల్‌లోకి అనుమతిస్తామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు.. ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

తె...