Telangana,hyderabad, మే 18 -- ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

మే 22 నుంచి 29 వరకు ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండు సెషన్ల వారీగా జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

ఈ పరీక్షలకు 4,12,724 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో అత్యధికంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ల ఉన్నారు. వీరి సంఖ్య 2 లక్షలకుపైగా ఉంది. వీరిలోనూ ఇంప్రూవ్‌మెంట్‌ రాసేవారు ఏకంగా 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సెకండియర్‌ పరీక్షలకు 1,34,341 మంది జనరల...