భారతదేశం, ఏప్రిల్ 30 -- తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మే/జూన్ 2025లో నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును మే 01, 2025 వరకు పొడిగించింది.

జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ పరీక్ష ఫీజు మొత్తాన్ని ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అందించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం, చెల్లింపు గేట్‌వేను ఉపయోగించి చెల్లించవచ్చని పేర్కొంది. మే 2, 2025లోపు TGBIE ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేయడానికి మాత్రమే అనుమతించబడ్డారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను సైతం విడుదల చేసింది. మే 22 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్ లో నిర్వహిస్తారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్...