భారతదేశం, ఏప్రిల్ 23 -- తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. తాజాగా ఇంటర్ బోర్డు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మే 22 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్ లో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు.

జనరల్, ఒకేషనల్ కోర్సులకు ఒకేసారి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. జూన్‌ 9న ఇంటర్ ఫస్టియర్ , జూన్ 10న సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి. జూన్ 11న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గం...