భారతదేశం, జూలై 28 -- హైదరాబాద్-విజయవాడ మధ్య ఎక్కువగా ప్రయాణం చేసేవారికి టీజీఎస్‌ఆర్టీసీ మంచి వార్త చెప్పింది. అది ఏంటంటే.. ఈ రూట్‌లలో నడిచే బస్సుల్లో టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. కనీసం 16 శాతం నుంచి గరష్టంగా 30 శాతం వరకు ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలంగాణ ఆర్టీసీ తెలిపింది.

ఈ తగ్గింపుల ఆఫర్ చూసుకుంటే.. గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరపై 30 శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం స్పెషల్ ఆఫర్ ఉంటుంది. అంతేకాదు సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16 శాతం మేరకు తగ్గిస్తున్నట్టుగా టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఈ స్పెషల్ ఆఫర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌కు వర్తిస్తాయి. టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం కింద...