భారతదేశం, అక్టోబర్ 26 -- టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుల గడువు దగ్గరపడింది. కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఈనెల 28వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవావాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 1743 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వీటిల్లో డ్రైవర్‌ కొలువులు 1,000, శ్రామిక్‌ పోస్టులు 743 ఉన్నాయి. ఈ పోస్టుల నియామకాల బాధ్యతను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)కు అప్పగించారు. ఆన్ లైన్ దరఖాస్తుల నుంచి అభ్యర్థులకు సంబంధిత పరీక్షలతో పాటు తుది ఫలితాల విడుదల ప్రక్రియ అంతా కూడా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డే పర్యవేక్షిస్తోంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఫిజికల...