భారతదేశం, మే 25 -- తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కొరత వేధిస్తోంది. దీంతో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకునేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసుండి.. పదో తరగతి విద్యార్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఈ ప్రక్రియలో కండక్టర్లుగా ఎంపికైన వారికి నెలవారీ చెల్లించే కన్సాలిడేటెట్‌ జీతం మొత్తం రూ.17,969గా నిర్ణయించారు. అయితే.. ఏజెన్సీ మాత్రం రూ.2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో సంస్థకు నష్టం జరిగితే.. దాన్ని ఈ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి రికవరీ చేయనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వీరికి వర్క్‌మెన్స్‌ కాంపన్సేషన్‌ యాక్ట్‌ వర్తించదని స్పష్టం చేసింది. పీఎఫ్, ఈఎస్‌...