Telangana,hyderabad, ఆగస్టు 10 -- అన్నదాతలకు తెలంగాణ వ్యవసాయశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.రైతులు మరణించినపుడు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేదోడు కల్పించే రైతుబీమా పథకానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. పాత వారు కాకుండా. కొత్తగా అర్హులైన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

రైతు బీమా స్కీమ్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 13వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని రైతులు.. స్థానిక ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది.

జూన్ 5వ తేదీ వరకు పట్టాదారు పాస్‌బుక్‌ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హులైన రైతులు పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేదా డిజిటల్‌ సంతకం చేసిన డీఎస్‌ పేపర్‌, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు దరఖాస్తుకు తప్పనిసరిగా జతపరచాల్సి ఉంటుంది. అంతకు ముందు బీమా చేసుకోని రైతులు క...