భారతదేశం, ఏప్రిల్ 30 -- తెలంగాణలోని అంగన్వాడీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అంగన్వాడీ చిన్నారులకు నెల రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తల్లిదండ్రులు, అంగ‌న్వాడీ యూనియ‌న్ల విజ్ఞప్తి మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం సెల‌వులు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.

మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ క‌మిష‌న‌రేట్ లో అంగ‌న్వాడీ యూనియ‌న్లు, అధికారులతో డైరెక్టర్ కాంతి వెస్లీ సమావేశం నిర్వహించారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా మే 1 నుంచి నెల రోజుల పాటు అంగన్వాడీలకు సెల‌వులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంగ‌న్వాడీ ల‌బ్దిదారుల‌కు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంగ‌న్వాడీ చిన్నారుల‌కు, గ‌ర్భిణుల‌కు, బాలింత‌ల‌కు టేక్ హోం ...