Telangana,kamareddy, ఆగస్టు 28 -- కామారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం పోచారం ప్రాజెక్టు అతి భారీస్థాయిలో వరద తరలివచ్చింది. ఊహించని దానికంటే ప్రాజెక్ట్ పైనుంచి నీరు దాటిగా ప్రవహిస్తూ వెళ్లింది.

ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ పక్కన గుంత పడటంతో.. ప్రాజెక్ట్ తెగిపోయే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపించాయి. స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు కూడా భయాందోళనను వ్యక్తం చేశారు. అయితే అతి భారీ వరదను కూడా తట్టుకొని ఈ ప్రాజెక్ట్ నిలబడింది. ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని ఇరిగేషన్ శాఖ ప్రకటించింది.

103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుంది సురక్షితంగా నిలబడిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్...