భారతదేశం, అక్టోబర్ 31 -- మొంథా తీవ్ర తుఫాన్ దాటికి తెలంగాణలో భారీగా పంట నష్టం వాటిల్లింది. చేతికివచ్చే దశలో రైతులకు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.

12 జిల్లాల్లోని 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక తెలిపింది. పూర్తిస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత పంట నష్టం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారిక ప్రకటనలో తెలిపారు.

ప్రాథమిక నివేదిక ప్రకారం 2,82,379 ఎకరాల్లో వరి, 1,51,707 ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,30,200 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట ...