Telangana,adilabad, జూలై 4 -- తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర, మహబూబ్ నగర్ క్యాంపస్ లో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ (2025-26) విద్యా సంవత్సరానికి మొత్తం 20, 258 అప్లికేషన్లు అందాయి.

జూన్ 21వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు. మెరిట్ లిస్ట్ పై కసరత్తు చేపట్టారు.ఈ ప్రక్రియ పూర్తి కావటంతో. ఇవాళ మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. లిస్ట్ లో పేరున్న విద్యార్థులకు. ఐఐఐటీ క్యాంపస్ లోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

రాష్ట్రంలో బాసర కేంద్రంగా ఐఐఐటీ క్యాంపస్ ఉండేది. అయితే ఈ విద్యా సంవత్సరం మహబూబ్ నగర్ లోనూ ప్రారంభించారు. ఈ రెండింటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికా...