భారతదేశం, నవంబర్ 19 -- మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి (నవంబర్ 19) సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు.

అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కోసం చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు. ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా చీరల పంపిణీని రెండు దశల్లో చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు.

తొలి దశలో ఇందిరా గాంధీ జయంతి రోజు నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్ర...