Telangana,warangal, జూలై 16 -- రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా కన్వీనర్‌ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్‌(2025-26) ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. నీట్‌లో అర్హత సాధించినవారికి మాత్రమే అవకాశం ఉంటుంది.

కన్వీనర్‌ కోటా సీట్ల కోసం విద్యార్థులు ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు జూలై 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల వరకు వర్సిటీ వెబ్‌సైట్‌లో వివరాలను రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ప్రైవేట్, మైనారిటీ, నాన్‌ మైనారిటీ మెడికల్, డెంటల్‌ కాలేజీలలోని కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద ఉన్న సీట్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్‌ వర్తిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 35 ప్రభుత్వ, 26 ప్రైవేటు...