భారతదేశం, డిసెంబర్ 14 -- ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏకగ్రీవాలను పక్కనపెట్టగా... ఈ దశలో 3,906 పంచాయతీలకు సర్పంచ్, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈటైమ్ దాటితే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. కానీ ఈ సమయంలోపు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఉంటుంది. గంటపాటు భోజన విరామం తర్వాత.... కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. మరోవైపు సర్పంచ్ ఓట్లను కూడా లెక్కిస్తారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే.... ఇదే సమయంలో ఉపసర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. వార్డుల్లో గెలిచిన అభ్య...