భారతదేశం, ఫిబ్రవరి 16 -- గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(HPV) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, టీకా మోతాదులను నిల్వ చేయడం వంటి సన్నాహాలను రాష్ట్రం పూర్తి చేసింది. ఫిబ్రవరి చివరి నాటికి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

కిందిస్థాయిలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా అమలు జరిగేలా చూసుకోవడానికి ఆరోగ్య శాఖ రాష్ట్రం అంతటా 1,200 నుండి 1,500 మంది ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చింది. ఈ సిబ్బంది పీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ను అందించడం, రోగనిరోధక సెషన్‌లను నిర్వహించడంలాంటివి చూసుకుంటారు.

ఇందులో బాగంగా 4.6 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. తెలంగాణ అంతటా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రజారోగ్య ప్రాంతాల్లో 14,...