Hyderabad, జూలై 1 -- బోనాలు గురించి తెలియని వారు ఉండరు. తెలంగాణలో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. బోనాలు పండుగ మొదలైపోయింది. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

మొత్తం తెలంగాణ అంతటా బోనాలు మొదలయ్యాయి. 2025లో జూన్ 29న, ఆదివారం నుంచి జరుపుతున్నారు. ఆషాఢ మాసంలో బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. అసలు బోనాలు పండుగ అంటే ఏంటి? దీని చరిత్ర, ముఖ్యమైన తేదీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తెలంగాణ సంస్కృతిని ప్రదర్శిస్తూ, మహాకాళి అమ్మవారిని పూజిస్తారు. ఇలా ఈ బోనాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. జూన్ 29 మొదలైన బోనాలు జూలై 20 వరకు కొనసాగుతాయి.

బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. ఇది దేవతలకు ఇచ్చే నైవేద్యాలలో ఒకటి అని చెప్పవచ్చు. ...