భారతదేశం, అక్టోబర్ 6 -- ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎలి లిల్లీ ప్రతినిధి బృందం సమావేశమైన అంగీకారం తెలియజేసింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్‌తో పాటు ఇతర ప్రతినిధులు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.

ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలి లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్షరింగ్ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ.9000 కోట్లు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో ఎలి లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించన...