భారతదేశం, ఏప్రిల్ 24 -- తెలంగాణలో భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

గురువారం నుంచి రెండు రోజుల పాటు పగలు వడగాల్పులు, రాత్రివేళల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి వాతావరణం నమోదవుతుం దని ఐఎండి అలర్ట్‌ జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదైంది. సాధారణం కన్నా 3.6 డిగ్రీలు ఎక్కువ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 44.3, మెదక్లో 43. 4, రామగుండంలో 42.8, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్ర తలు నమోదయ్యాయి.

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో చాలా ప్రాంతాలు భరించలేని వేడ...