భారతదేశం, ఆగస్టు 15 -- ఏపీపీ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మల్టీజోన్ల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లా డిగ్రీ కలిగి ఉండాలి. అంతేకాకుండా రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్ కోర్టులో మూడేళ్లపాటు పని చేసిన అనుభవం కూడా ఉండాలి. https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....