భారతదేశం, జూలై 7 -- ఢిల్లీ: ఖేలో ఇండియా గేమ్స్-2026ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్. మాండవీయకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో ఆయనను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ఖేలో ఇండియాతో పాటు జాతీయ క్రీడలు, ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.

క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ, క్రీడా నిపుణుల ఎంపిక, ఇతర క్రీడా కార్యకలాపాల కోసం ఖేలో ఇండియా పథకం కింద నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో క్రీడా సౌకర్యాల నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిర్దిష్టంగా నిధులు కోరి...