భారతదేశం, అక్టోబర్ 9 -- రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మెుత్తం 565 జెడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తక్షణమే నామినేషన్ల ప్రక్రియ మెదలవుతుందని తెలిపింది.

మెుదటి విడతలో 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థులు జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థి రూ.5,000. రిజర్వేషన్ అభ్యర్థి రూ.2500 డిపాజిట్ చేయాలి. ఎంపీటీసీకి జనరల్ అభ్యర్థి రూ.2500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. అ...