భారతదేశం, సెప్టెంబర్ 29 -- తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుుముదిని ప్రకటించారు. మెుదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్ఈసీ వెల్లడించారు. అక్టోబర్ 23న తొలివిడత, అక్టోబర్ 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. నవంబర్ 11 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఇక గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4, మూడో విడత నవంబర్ 8 నిర్వహిస్తామన్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వా ఫలితాలు వెల్లడిస్తారు.

Published by HT Digital Content Servic...