భారతదేశం, జనవరి 15 -- తెలంగాణ ప్రభుత్వానికి భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు.

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన 'సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్' జరిగింది. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, తెలంగాణ - ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం త...