భారతదేశం, ఏప్రిల్ 18 -- సైనిక్ స్కూల్స్.. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ఈ ప్రత్యేక పాఠశాలల ముఖ్య ఉద్దేశం.. విద్యార్థులను జాతీయ రక్షణ అకాడమీ, ఇతర సైనిక శిక్షణ సంస్థల్లో ప్రవేశానికి శారీరకంగా, మానసికంగా, విద్యాపరంగా సిద్ధం చేయడం. అలాగే వారిలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తిని పెంపొందించడం ఈ పాఠశాలల ప్రత్యేకత. ఇలాంటి స్కూల్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేలా చర్యలు ప్రారంభించారు కేంద్రమంత్రి బండి సంజయ్.

'సిరిసిల్ల లేదా హస్నాబాద్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. సైనిక్ స్కూల్ ఏర్పాటు వల్ల స్థానిక విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాయకత్వ శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించడమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ సమైక్యత, దేశభక్తి భావన పెంపొందుతుంది. సైనిక్...