Andhrapradesh,telangana, మే 24 -- ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉంటే వచ్చే వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.

తెలంగాణలో ఈ నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు లేదా ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది.

ఇవాళ(మే 24) నిర్మల్, నిజామాబాజ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది 40- 50 కి,మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఆద...