భారతదేశం, అక్టోబర్ 8 -- పిల్లలకు దగ్గు మందు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు దగ్గ మందులపై రాష్ట్రంలో నిషేధం విధించింది. ఇటీవలే కోల్డ్ రిఫ్‌ను పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రిలీఫ్, రెస్పీ ఫ్రెష్-టీఆర్ సిరప్‌లపై నిషేధం విధించింది. ఈ రెండింటిలోనూ కల్తీ జరిగిందని తేలడంతో విక్రయాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవి గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలుగా పేర్కొన్నారు అధికారులు.

దగ్గు మందుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్యం విభాగం హెచ్చరించింది. తగిన నివారణ చర్యలతో పిల్లలకు వచ్చిన దగ్గు, జలుబును కట్టడి చేయవచ్చని తెలిపింది. వెంటనే తగ్గిపోవాలని ఇష్టం వచ్చినట్టుగా మందులు వాడితే పిల్లల ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది...