భారతదేశం, సెప్టెంబర్ 17 -- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెప్టెంబర్ 17, 2025న హైదరాబాద్‌లో కొత్త పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ. ఈ పార్టీ ప్రధానంగా వెనుకబడిన తరగతులు(బీసీలు), పేద ప్రజల కోసం అని మల్లన్న ప్రకటించారు. ఆత్మగౌరవం, అధికారం, రాజకీయాల్లో న్యాయమైన వాటా నినాదంతో పార్టీని తీసుకొచ్చారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన అజెండాగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్టుగా తీన్మార్ మల్లన్న ఇప్పటికే చెప్పుకొచ్చారు.

పార్టీ జెండా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉంటుంది. ఎరుపు అంటే పోరాటం, ఆకుపచ్చ అంటే రైతులు అనే అంశంతో పెట్టినట్టుగా అర్థమవుతోంది. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అనే పదాలు ఉన్నాయి.

సెప్టెంబర్ 17వ తేదీ బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నానని తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ ...