భారతదేశం, నవంబర్ 17 -- తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఈరోజు నుంచి మరింత పెరగనుంది. ఇప్పటికే జనాలు సాయంత్రం 6 దాటితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. చలికి వణికిపోతున్నారు. ఉదయంపూట భారీగా పొగమంచు కురుస్తున్నది. చలి గాలులు కూడా వీస్తున్నాయి.

తెలంగాణలో వచ్చే రెండు రోజులు అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీ ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారంనాడు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శీతలగాలులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణో...