Telangana, ఏప్రిల్ 20 -- భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఆర్వోఆర్‌-2020 రద్దు చేసి... కొత్తగా భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారమే... నాలుగు మండలాల్లో సేవలు అందుతున్నాయి. ఈ జూన్ 2 వరకల్లా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

భూ భారతి చట్టం ప్రకారం పకడ్బందీగా భూ రికార్డుల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఎలాంటి వివాదాలు లేకుండా భూసమస్యలకు పరిష్కారం ఉంటుందని... రైతులకు ఇబ్బందులు లేకుండా కొత్త చట్టంలో కీలక సెక్షన్లను పొందుపర్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. భూ భారతి చట్టానికి సంబంధించిన కరపత్రాలను కూడా రైతులకు అందజేస్తున్నారు.

పట్టా భూముల యజమానుల హక్కుల ...