భారతదేశం, మే 16 -- మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి వెల్లువెత్తిన పెట్టుబడులు, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో విపరీతంగా పెరుగుతున్న విద్యుత్ వినియోగం, సప్లైపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.పరిశ్రమలతో పాటు గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ (మెట్రో, ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌) దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రేవంత్ సూచించారు. భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలను ముందస్తుగా అంచనా వేసి.. రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

2.రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ...