Hyderabad, సెప్టెంబర్ 19 -- పవన్ కల్యాణ్ ఓజీ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గట్టి షాకే ఇచ్చింది. ఇక తెలంగాణలో టికెట్ల ధరలు పెంచడం, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం జరగదని గతంలో ముఖ్యమంత్రే చెప్పినా ప్రతి సినిమాకూ పెంచుతూ వెళ్తున్నారు. ఓజీ మూవీ కోసం సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లలో ఏమేర ధరలు పెరిగాయో చూడండి.

పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ వచ్చే శుక్రవారం అంటే సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం (సెప్టెంబర్ 19) జీవో రిలీజ్ చేసింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్ పై రూ.100, మల్టీప్లెక్స్ లలో ఒక్కో టికెట్ పై రూ.150 పెంచేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు గరిష్ఠంగా రూ...