భారతదేశం, ఫిబ్రవరి 22 -- ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రితో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ నీటి హక్కుల విషయంలో శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నామన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముందుకు వెళుతున్నామని చెప్పారు. అవసరమైన నిధులను సమీకరిస్తున్నామని వెల్లడించారు.

'ఎంతటి జఠిలమైన సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారమవుతుందని బలంగా విశ్వసిస్తా. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతూ శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. మాకు ఎలాంటి ...